![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -172 లో.... ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే ప్రేమ వచ్చి.. విశ్వ ఫ్రెండ్స్ కి బుద్ది చెప్తుంది. దాంతో వాళ్ళు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. చిన్న ఎర్రమిరపకాయలాగా ఉంది అందరిని భయపెట్టిందని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇద్దరు కాలేజీకి వస్తారు. ఎందుకు వాళ్ళని అలా అన్నావని ధీరజ్ అడుగుతాడు. నిన్ను అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. నేను ఎలా ఉరుకుంటానని ప్రేమ అంటుంది. నన్ను అంటే నీకేంటి అని ధీరజ్ అడుగుతాడు. నాకేం ప్రేమ అంటుంది.
ఆ తర్వాత నర్మద ఆఫీస్ నుండి నడుచుకుంటూ వెళ్తుంటే.. సాగర్ వస్తాడు. కాసేపు సాగర్ తో నర్మద అయిష్టంగా మాట్లాడుతుంది కానీ సాగర్ తన కోపాన్ని తగ్గిస్తాడు. ఇద్దరు కలిసి సరదాగా బయటకు వెళ్తారు. ఆ తర్వాత చందు ఆఫీస్ లో ఉండగా తనకి అప్పు ఇచ్చిన సేట్ చందు దగ్గరికి వచ్చి నాకు డబ్బు ఇవ్వాలని గొడవ పెడతాడు.
మరొకవైపు శ్రీవల్లి వంట చేస్తుంటే తన చెల్లి బుజ్జి వస్తుంది. తరువాయి భాగంలో శ్రీవల్లి బుజ్జితో అమ్మ మోసం చేసి పెళ్లి చేసింది. ఆ పది లక్షల రూపాయల విషయం ఎక్కడ తెలుస్తుందో.. నా కాపురం ఎక్కడ చెడిపోతుందోనని భయపడుతున్నానని బుజ్జితో శ్రీవల్లి చెప్తుంటే దూరం నుండి ప్రేమ, నర్మద చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింహో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |